రాష్ట్ర రాజధాని పార్టీ జెండాలతో కలకలలాడుతోంది. శనివారం బీజేపీ కార్యవర్గ సమావేశం జరుగనున్న నేపథ్యంలో హోర్డింగ్స్‌తో నగరం హోరెత్తిపోతోంది. ఒకవైపు టీఆర్ఎస్, మరోవైపు బీజేపీ లు హోర్డింగులు, ఫ్లెక్సీలతో కాషాయం, గులాబీ మయంగా మారింది నగరం.
భారీ కటౌట్స్ తో నగరమంతా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా పార్టీ నాయకులు నగరమంతా తోరణాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో నింపేశారు. వారం రోజుల ముందుగానే టీఆర్ఎస్ పార్టీ మెట్రో పిల్లర్లు, బస్టాప్ లకు ప్లేక్సీలను ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు.. టీఆర్ఎస్ చేపడుతున్న పథకాల గురించి ప్రచార పోస్టర్లను పరిచేసింది. ఇలా రెండు పార్టీలకు సంబంధించిన ప్రచారంతో నగరం కొత్తరూపు సంతరించుకుంది.
టీఆర్ఎస్ మరో అడుగు ముందుకు వేసి శుక్రవారం రాష్ట్రానికి రానున్న ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలుకుతూ.. భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. నగరంలో ఇప్పుడు ఎక్కడ ప్రతీ చౌరస్తాలో పోటాపోటీ బ్యానర్లు కనిపిస్తున్నాయి.