కొంతకాలంగా వైసీపీ సర్కార్ పై మాటల దాడిన చేస్తున్న బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్ కు మద్దతు పలికారు.
విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. క్షతగాత్రులు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటుండటంతో వారిని కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాని, ప్రమాదం తీరు చూస్తుంటే మానవ తప్పిదంలా కనపడుతోందని అనుమానం వ్యక్తం చేశారు.
ఇక ఇలాంటి ఘటనల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సహాయం చేయడానికి అయినా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కన్నా వ్యాఖ్యానిస్తూ… బాధితులకు ప్రభుత్వం భారీ నష్టపరిహారాన్ని ప్రకటించటం మంచి పరిణామం అని తెలిపారు. మొత్తం ఘటనతో సిట్టింగ్ జడ్జిత్ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.