కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. ఈ క్రమంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇంఛార్జ్‌గా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను నియమించారు.
దీంతో పాటు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సహ ఇంఛార్జ్ గా పార్టీ నియమించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జ్‌గా నియమించినట్టు బీజేపీ ఓ ప్రకటలో వెల్లడించింది. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మాట్లాడుతూ…
కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ ఇంఛార్జ్‌గా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారని వెల్లడించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతంలో పలు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించారు.
ఆయన మంచి నైపుణ్యం కలిగిన రాజకీయ నాయకుడని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిలో పార్టీ అధికారాన్ని నిలుపుకోవడానికి ఆయన సహాయపడగలరని పార్టీ భావిస్తోందని అంటున్నారు.