మనీ లాండరింగ్ కేసులో నిందితునిగా ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ మాట్లాడే ప్రతి మాట వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో కేసీఆర్ ను ఇరికించాలన్న కుట్రతోనే జైలులో ఉన్న సుకేశ్ తో కేసీఆర్, కవిత ప్రస్తావన వచ్చేలా మాట్లాడిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
కేంద్రంలో బీజేపీని త్వరలోనే బొంద పెట్టే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.కాగా 15 కేజీల ఘీ కోడ్ నేమ్ పేరుతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఇచ్చిన సూచన మేరకు రూ. 15కోట్లు బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద ఇచ్చినట్లు తీహార్ జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ శుక్రవారం లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ లోని బీఆర్‌ఎస్ ఆఫీసులో పార్క్ చేసి ఉన్న రేంజ్ రోవర్ 6060 కారులో ప్రస్తుత లిక్కర్ స్కాం కేసు నిందితుల్లో ఒకరైన ఏపీ అనే వ్యక్తికి ఆ డబ్బులు డెలివరీ చేశాను అని లేఖలో పేర్కొనడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.