పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిన వైట్ ఛాలెంజ్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓకే చెప్పారు. డ్రగ్స్ వాడకూడదు అని ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రజా ప్రతినిధులుగా మనం ముందుగా టెస్ట్ చేయించుకుందాం అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరారు.
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు మంత్రి కేటీఆర్ కు రేవంత్ వైట్ ఛాలెంజ్ విసిరారు. దీనిపై స్పందించిన కొండా రేవంత్ కోరినట్లుగా రక్త పరీక్షల కోసం తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు వచ్చారు. కానీ కేటీఆర్ మాత్రం రాహుల్ రెడీ అయితేనే తాను రెడీ అంటూ ప్రకటించారు.
Advertisements
డ్రగ్స్ టెస్ట్ కు రెడీ అయిన కొండా… తను మరో ఇద్దర్ని నామినేట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఛాలెంజ్ చేశారు. దీనిపై స్పందించిన బండి సంజయ్… బలిసిన వారు మాత్రమే డ్రగ్స్ తీసుకుంటారని, పేదోడికి అవసరం రాదు అన్నారు. మాజీ ఎంపీ కొండా మంచోడన్న ఆయన, తన ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. నాకు ఎలాంటి అలవాట్లు లేవని… అక్టోబర్ 2తో తన పాదయాత్ర ముగిస్తుందని, ఆ వెంటనే ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తానని ప్రకటించారు.