హైదరాబాద్ లో విద్వంసాలు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని, తమ వద్ద సాక్ష్యాధారాలున్నాయంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో భయానకర వాతావరణం సృష్టించేందుకే సీఎం కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని… సీఎంగా ఉన్న వ్యక్తికి ఆధారాలతో సహా సమాచారం వస్తే అరెస్ట్ చేయకుండా పత్రికలకు ప్రకటలు ఇవ్వటంలో ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు.
దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంలోనూ విద్వంసాలు జరుగబోతున్నాయంటూ ప్రచారం చేసే ప్రయత్నం చేశారని, ఇప్పుడు కూడా అలాంటి కుట్రలకే తెరలేపారన్నారు. పీవీ ఘాట్, ఎన్టీయార్ ఘాట్ ను కూలుస్తామన్నా అక్బరుద్దీన్ ముందుగా అరెస్ట్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర శాఖ కోరుతుందని, అవసరం అయితే ఏపీ శాఖతో కూడా సంప్రదించి భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాస్తామన్నారు.
పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ ను టచ్ చేసి చూస్తే… తమ ప్రతాపమేందో చూపిస్తామని హెచ్చరించారు.