టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గూండాయిజం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మైనంపల్లి అనుచరుల దాడిలో గాయపడ్డ బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ను ఆయన పరామర్శించారు. బండితోపాటు మాజీ ఎంపీ విజయశాంతి, రామచంద్రరావు సహా పలువురు నేతలు ఉన్నారు. మైనంపల్లి అక్రమాలను వెలికితీసి రౌడీయిజాన్ని తొక్కి పడేస్తామని హెచ్చరించారు బండి సంజయ్.
మైనంపల్లి బీజేపీలో చేరదామని వస్తే తరిమికొట్టామన్న బండి.. అలాంటి వ్యక్తిని టీఆర్ఎస్ లో చేర్చుకోవడం సిగ్గుచేటన్నారు. బీజేపీ కార్పొరేటర్ పై దాడి జరుగుతున్నా అడ్డుకోని పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీ వెంటనే ఈ ఇష్యూపై స్పందించి మైనంపల్లి సహా టీఆర్ఎస్ గుండాలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు బండి సంజయ్.