ఇటీవల పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు.
గత ఎనిమిదేండ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం యువతీ యువకులు ఎదురు చూస్తున్నారని, అలాంటి వారికి ప్రభుత్వం ప్రకటన కొంత ఊరటనిచ్చిందని తెలిపారు.
కానీ రెండేండ్లుగా కొవిడ్ సంక్షోభంతో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల వల్ల పోటీ పరీక్షల కోసం యువతీ, యువకులు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టే పరిస్థితి లేదని ఆయన అన్నారు.
ఈ క్రమంలో 2014, 2018 ఎన్నికల సమయంలో ఇచ్చి హామీ మేరకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి స్టడీ సర్కిల్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.
రాష్ట్రంలో ప్రతి నియోజక వర్గానికి ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని సూచించారు. కోచింగ్ సెంటర్లలో వారికి అల్పాహారం, భోజనాన్ని ప్రభుత్వమే కల్పించాలన్నారు.