పార్లమెంట్‌లో ప్రతిష్టించనున్న ‘సెంగోల్’పై బీజేపీ, కాంగ్రెస్ మధ్య రగడ మొదలైంది. తాజాగా బ్రిటిషర్ల నుంచి భారత్‌కు జరిగిన అధికార బదిలీకి ఈ రాజదండం చిహ్నమని ఎక్కడా ఆధారం లేదన్న కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యలపై బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై నిప్పులు చెరిగారు.
1947లో జరిగిన వాస్తవాలను మాత్రమే అదీనం స్వామి చెప్పారని ఆయన పేర్కొన్నారు. సెంగోల్‌ను ఇన్ని రోజులు మ్యూజియంలో ఓ వాకింగ్ స్టిక్ లాగా కాంగ్రెస్ పెట్టిందని ఆయన మండిపడ్డారు. దీనిపై దేశ ప్రజలకు కాంగ్రెస్ సంజాయిషీ ఇచ్చు కోవాలని ఆయన డిమాండ్ చేశారు.
సనాతన ధర్మాన్ని అవమానించినందుకు గాను తమిళ ప్రజలకు కాంగ్రెస్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అంతకు ముందు భారత్‌కు బ్రిటీష్ ప్రభుత్వం స్వతంత్ర్యం ప్రకటించిన నేపథ్యంలో అధికార బదిలీకి గుర్తుగా ప్రధాని నెహ్రూకు లార్డ్ మౌంట్ బాటెన్ సెంగోల్ ప్రధానం చేశారని, దాన్ని మోడీ పున: ప్రతిష్టించ బోతున్నారని తిరువావదుతురై అదీనం అంబలవణ దేశిక పరమాచార్య స్వామి అన్నారు.
ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. బ్రిటిషర్ల నుంచి భారత్‌కు జరిగిన అధికార బదిలీకి ఈ రాజదండం చిహ్నమని ఎక్కడా లిఖిత పూర్వక ఆధారాలు లేవని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. బీజేపీ చేస్తున్న ఈ ప్రచారం అంతా పెద్ద బోగస్ అని ఆయన కొట్టి పారేశారు.