ప్రధాని మోడీ హయాంలో ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది బీజేపీ జాతియ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ రెండో స్థానంలో ఉందని ఆయన అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ రోజ ఢిల్లీలో ప్రారంభమయ్యాయి.
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రాధాన్యత గురించి పార్టీ నేతలకు ఆయన వివరించారు. 9 రాష్ట్రాల్లో విజయాన్ని కైవసం చేసేందుకు వ్యూహ రచన చేయాలని సూచించారు.
ప్రధాని మోడీ హయాంలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని జేపీ నడ్డా అన్నారు. మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ రెండు, ఆటోమొబైల్ రంగంలో మూడో అతి పెద్ద తయారీదారుగా భారత్ ఉందన్నారు. పేదలకు సాధికారత కల్పించేందుకు పలు సంక్షేమ పథకాలతో కేంద్రం కృషి చేస్తోందన్నారు.
ఇటీవలే గుజరాత్లో బీజేపీ ఘన విజయం సాధించిందన్నారు. 182కి గాను 150కి పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారని చెప్పారు. ఇది అసాధారణ విషయమన్నారు. హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ ఓటమి పాలైందని అయితే రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం ఒక శాతం కంటే తక్కువే ఉందన్నారు.
అంతకుముందు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే ప్రాంతానికి ప్రధాని మోడీ రోడ్ షో ద్వారా వచ్చారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ కార్యవర్గ సమావేశాలను ఆయన ప్రారంభించారు. 2 రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.