గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎన్నికల కమిషన్ రాత్రికి రాత్రి ఇచ్చిన ఉత్తర్వులపై వివాదం రాజుకుంటోంది. ఇప్పటికే స్వస్తిక్ గుర్తుకు బదులుగా పోలింగ్ కేంద్రాల నెంబర్ ముద్ర వేసినా ఓటుగానే పరిగణించాలంటూ ఈసీ ఉత్తర్వులు జారీ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండగా… ఇప్పుడు పెన్నుతో టిక్ చేసినా ఓటు వేసినట్లే అని ప్రకటించడంపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ విషయంపై విచారణ చేపట్టాలని కోరుతూ బీజేపీ నేతలు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మరికొద్దిసేపట్లో ఈ అంశంపై వాదనలు ప్రారంభం కానున్నాయి. కౌంటింగ్ కొన్ని గంటల ముందు తీసుకొచ్చిన ఈ సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.