ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ జరపాలని ఇటు ప్రభుత్వం అటు బీజేపీ ఫోకస్ చేశాయి. సేవా సంపారన్ అభియాన్ పేరుతో 20 రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేయబోతున్నారు. మోడీ తన 20 సంవత్సరాల ప్రజా జీవితానికి గుర్తుగా ఈ 20రోజుల సేవా కార్యక్రమాన్ని బీజేపీ చేస్తోంది.
వ్యాక్సిన్ సేవ పేరుతో వ్యాక్సినేషన్ చేయిద్దాం… ప్రధాని మోడీకి బర్త్ డే శుభాకాంక్షలు చెప్దాం అంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్షుఖ్ మాండవియా ప్రకటించారు. దాదాపు 8లక్షల మంది ఆరోగ్య సిబ్బందితో ఒకే రోజు 2కోట్ల వ్యాక్సినేషన్ చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఉచిత వ్యాక్సిన్ తో పాటు ఉచిత కిరాణ సరుకులను బీజేపీ పంపిణీ చేస్తోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న యూపీలోని 71 పట్టణాల్లో క్లీన్ గంగా రివర్ కార్యక్రమాన్ని చేపట్టారు.
దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు.