హైదరాబాద్ లోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ను ముట్టడించారు బీజేపీ కార్పోరేటర్లు. కొత్తగా ఎన్నికైన కార్పోరేటర్లతో వెంటనే కొత్త కౌన్సిల్ ఏర్పాటు చేయాలని, కొత్త కార్పోరేటర్లతో ప్రమాణం చేయించకుండా ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేస్తున్నారని కార్పోరేటర్లు ఆరోపించారు.
తాము గెలిచి, కార్పోరేటర్లుగా ఎన్నికైనప్పటికీ…. తాము ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామన్నారు. అంతకుముందు టూరిజం భవన్ లో సమావేశమైన కార్పోరేటర్లు ఒక్కోక్కొరుగా ప్రగతి భవన్ ను ముట్టడిస్తున్నారు. దీంతో పోలీసులు వారందరినీ అరెస్ట్ చేస్తుండటంతో ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.