మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు బీజేపీ సర్కార్ గిఫ్ట్ ఇచ్చింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో 70వేల కోట్ల అవినీతి ఆరోపణలపై ఆయనపై నమోదైన కేసును ప్రభుత్వం ఎత్తివేసింది. అజిత్ అండతో అధికారంలోకి వచ్చి రాగానే బీజేపీ సర్కార్ కేసు ఎత్తివేయటం మహారాష్ట్రలో సంచలనంగా మారింది.
కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వ హాయంలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణం, అనుమతుల విషయంలో అజిత్ పవార్ 70వేల కోట్ల అవినీతి చేశారని ఆయనపై కేసు నమోదైంది. ఇప్పుడు కేసును క్లోజ్ చేయటంతో… ఈ కేసును బూచీగా చూపించే అజిత్‌ను బీజేపీవైపు తిప్పుకున్నారని, అందుకే ఈ మేలు అంటూ శివసేన, కాంగ్రెస్ విమర్శల దాడి ప్రారంబించాయి.