బీజేపీ ఏపీ రాజకీయాల్లో మరోసారి చక్రం తిప్పబోతుందా…? జగన్ గెలుపు కోసం తెర వెనుక బీజేపీ సహాయం ఉందన్న మాటలు నిజమేనా…? చంద్రబాబును దెబ్బతీస్తూ ఇప్పుడు జగన్‌ను కూడా అణగదొక్కబోతుందా…? బీజేపీ ఆటలో పవన్ కీలుబొమ్మనా… కీలకబొమ్మనా…?
ఐదేళ్ల కాలంలో టీడీపీతో ఉన్న మితృత్వం శత్రుత్వమైంది. ఆ శత్రువు యొక్క శత్రువుకు బీజేపీ స్నేహ హస్తం అందించింది. వ్యూహాం ఫలించి వైసీపీ గెలిచింది. కానీ అది మాత్రమే బీజేపీ గోల్ కాదు కదా… బీజేపీగా ఏపీలో అధికారంలోకి రావాలి. అంటే ఒకప్పటి మిత్రువైన టీడీపీని వైసీపీ అనే శత్రువుతో ఎలా కొట్టగలిగిందో… ఇప్పుడు గత ఎన్నికల రహస్య మిత్రువైన వైసీపీని తన శత్రువైన పవన్‌ను అడ్డంపెట్టుకొని కొట్టబోతుంది. కానీ ఈసారి జగన్‌కు అప్పగించినట్లుగా అధికారం ఇవ్వకుండా వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ జెండా ఏపీపై ఎగురవేసేలా వ్యూహాం ఖరారైంది. ఇదే ప్రచారం, వార్తలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఏపీలో ఎలాగైన అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ… ఇప్పటికే టీడీపీని, ఇప్పుడు వైసీపీని ఖతం చేయబోతుందని తద్వారా పవన్‌ను అడ్డంపెట్టుకొని ఏపీలో అధికారంలోకి రాబోతుందని ఊహాగనాలు వినిపిస్తున్నాయి. అవసరమైతే జనసేనను బీజేపీలో విలీనం చేసేందుకు కూడా అవకాశం ఉందని ఏపీలో చర్చ నడుస్తోంది.