బీజేపీకి రాష్ట్రంలో ఎక్కడా మందిరాలు గుర్తుకు రావు… చార్మినార్ ఆనుకోని ఉన్న భాగ్యలక్ష్మి గుడి మాత్రమే ఎందుకు గుర్తు వస్తుంది? ఇది గతంలో టీఆర్ఎస్ నేతల ప్రశ్న. బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుందని, రెచ్చగొట్టేందుకే బీజేపీకి చార్మినార్ భాగ్యలక్ష్మి గుడి గుర్తుకొస్తుందని ఆరోపిస్తారు.
కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత భాగలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో టీఆర్ఎస్ నేతలు మరీ ముఖ్యంగా కేటీఆర్ ఇప్పుడేమంటారు అంటూ బీజేపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అమ్మవారిని దర్శించుకుంటే రాజకీయం అన్నది మీరు. మరిప్పుడు మీ కుటుంబ సభ్యురాలే అమ్మవారి దగ్గరకు వెళ్లారు… ఇది కూడా రాజకీయమేనని ఒప్పుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.
టీఆర్ఎస్ నాయకులు ప్రజల నమ్మకాలు, సెంటిమెంట్లతో రాజకీయం చేస్తారని… గ్రేటర్ ఎన్నికల్లోనూ బీజేపీపై అదే ప్రయత్నం చేసినా ఫలించలేదంటున్నారు.