తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుతింటోందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జ్ తరుణ్ చుగ్. 17న హోంమంత్రి అమిత్ షా.. నిర్మల్ వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించి.. సన్నాహక సమావేశంలో పాల్గొన్నారాయన. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బండి సంజయ్ ప్రజా సంకల్ప యాత్రతో కేసీఆర్ కు భయం ఎక్కువైందని విమర్శలు చేశారు.
ప్రతీ కార్యకర్త అమిత్ షా సభకు హాజరై.. విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తరుణ్ చుగ్. కేసీఆర్ సర్కార్ ప్రజావ్యతిరేక పాలనపై పోరాటం చేద్దామని చెప్పారు. ఈ సందర్భంగా అమిత్ షాను పటేల్ తో పోల్చారాయన. ఆనాడు సెప్టెంబర్ 17న అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణకు వచ్చారని.. ఇప్పుడు సెప్టెంబర్ 17న హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌ను సాగనంపేందుకే నిర్మల్ లో శంఖారావం పూరిస్తున్నట్లు తెలిపారు తరుణ్ చుగ్.