తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ సీనియర్లు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇందుకు ఇన్ ఛార్జ్ లుగా ఉన్న సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ వద్ద రాష్ట్ర నాయకత్వం ప్రపోజల్ పెట్టింది.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు విడతల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేశారు. ఇప్పటివరకూ ఐదు విడతలు పూర్తయ్యాయి. ఐదు విడతల్లో 50కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బండి పాదయాత్రను పూర్తి చేశారు. దీంతో ఆరో విడత పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు.
మార్చి 16 నుంచి బండి సంజయ్ ఆరోవిడత పాదయాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పాదయాత్రకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.