బండ కార్తీకారెడ్డి, బీజేపీ నేత
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఎమ్మెల్యే ముసుగులో రౌడీయిజం చేస్తున్నారు. ఇప్పటికైనా పద్దతి మార్చుకుని ప్రజాప్రతినిధిగా వ్యవహరించాలి. మైనంపల్లి రౌడీ షీటర్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు.. అయినా తన పాత జీవన విధానాన్నే కొనసాగిస్తున్నారు. ప్రశ్నించే ప్రతీ వ్యక్తిపై దాడులకు పాల్పడటం ఆయనకు పరిపాటిగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని విమర్శించే ముందు.. ఆయన తన గత జీవితాన్ని గుర్తు తెచ్చుకోవాలి.
రౌడీషీటర్ గా భూకబ్జాలకు పాల్పడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే గతంలో నగర బహిష్కరణ చేశారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని ఆరోపణలు చేస్తే బాగుంటుంది. కార్పొరేటర్ శ్రవణ్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేస్తే.. బీజేపీ కార్యకర్తలే చేశారంటూ ఎమ్మెల్యే చెప్పడం సిగ్గుచేటు. ఆయన ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. దాడికి వీడియో క్లిప్పింగ్సే నిదర్శనం. మైనంపల్లి ఇప్పటికైనా రౌడీయిజాన్ని మానుకుని ప్రజా ప్రతినిధిలా వ్యవహరిస్తే బాగుంటుంది.