కె. కృష్ణసాగర్ రావ్.. బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి.
భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకన్నా తక్కువ సంఖ్యలో కరోన పరీక్షలను ఉద్దేశపూర్వకంగా చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు కు అపాయం కలిగించినందుకు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటెలా రాజేందర్ తన మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.
ఆరోగ్య సంక్షోభం సమయంలో ఆరోగ్య మంత్రి పనితీరు సరిగా లేకపోవడంతోపాటు , ICMR మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం టెస్టులు నిర్వహిస్తోందని చెబుతూ ప్రతిపక్ష పార్టీలను , మీడియాను, ప్రజలను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించారు. చాలా రోజుల నుండి రోజువారీ బులెటిన్లలో ICMR ఆదేశించినట్లు ఆరోగ్యశాఖ కూడా టెస్టుల డేటాను రెగ్యులర్ గా రిలీజ్ చేయలేదు.
సిఎం కెసిఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో COVID19 కేసుల సంఖ్యను మొదటి నుండి తారుమారు చేస్తోందని బీజేపీ చేసిన ఆరోపణలు నిజమవుతున్నాయి. ఏప్రిల్ రెండవ వారం తరువాత రాష్ట్రంలో టెస్టుల సంఖ్యను అమాంతంగ తగ్గించారు. బీజేపీ హెచ్చరికలను ఆరోగ్యశాఖ పట్టించుకోలేదు.
దేశంలో తెలంగాణ ప్రభుత్వం కరోన కేసుల సంఖ్య , మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తూ నివేదికలు విడుదల చేసింది.
మే 15 నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 22,842 పరీక్షలు మాత్రమే నిర్వహించగా, ఛత్తీస్‌ఘడ్, అస్సాం వంటి చిన్న రాష్ట్రాలు తెలంగాణ కంటే ఎక్కువ పరీక్షలు నిర్వహించాయి.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రోజుకు సగటున 9,000 పరీక్షలు నిర్వహిస్తుంది, తెలంగాణ రాష్ట్రం మాత్రం రోజుకు కేవలం 200 టెస్టులు చేస్తుంది. భారత దేశం మొత్తంలో సగటున కోవిడ్ పరీక్షలు మిలియన్ జనాభాకు 1,025 కాగా, తెలంగాణ సంఖ్య 546 మాత్రమే.
సరిహద్దు రాష్ట్రాల్లో దాదాపు ఒకే రకమైన జనాభా ఉన్న తమిళనాడు 3 లక్షల టెస్టులు చేయగా ,ఆంధ్రప్రదేశ్ 1,75,000 కేసులను టెస్టులు చేసింది.
COVID19 కేసుల సంఖ్య , మరణాల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ టెస్టులు చేసి చూపించడాన్ని బీజేపీ తీవ్రంగా పరిగనిస్తోంది.
టీఆరెస్ ప్రభుత్వం
ప్రజల ప్రాణాలతో చేలగాటం ఆడుతోంది.
ఈ మహమ్మారిని ఈలాగే వదిలేస్తే కమ్యూనిటీ స్ప్రెడ్ జరిగే ప్రమాదం ఉందని బీజేపీ హెచ్చరిస్తోంది. టెస్టుల సంఖ్య పెంచకుండా వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం చేస్తే వైరస్ ఇతర ప్రాంతాలకు విస్తరించి ప్రజలకు మరింత ప్రమాదం కలిగే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది.
రాష్ట్ర ప్రజలకు ICMR మార్గదర్శకాల ప్రకారం టెస్టులు చేస్తున్నామని పదే పదే చెప్పే మంత్రి ఈటెల రాజేందర్ ప్రజా ఆరోగ్య వ్యవస్థను దాని ప్రమాణాలను దిగజార్చినందున, కోట్లాది మంది ప్రాణాలను పణంగ పెట్టినందున ఆయన నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
ఇటువంటి అత్యంత ప్రమాదకరమైన సమయంలో covid 19 టెస్టులను ఎందుకు తక్కువ చేస్తున్నారో ? కరోన కేసులను ఎందుకు తక్కువ చేసి చూపిస్తున్నారో ? ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు వివరణ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.
ప్రజారోగ్య వ్యవస్థను బాధ్యతా రహితంగా నిర్వహించడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను పెద్ద ప్రమాదంలో పడేసింది.