కె కృష్ణసాగర్ బీజేపీ అధికార ప్రతినిధి
అయోధ్యలో గొప్ప రామాలయం నిర్మించడానికి సామాన్యులు రామమందిర ట్రస్ట్ కి విరాళాలు ఇస్తుంటే.. వాటిపై టిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు అసంబద్ధమైన ,రెచ్చగొట్టే బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. నిరంతరం ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం ద్వారా టిఆర్ఎస్ పార్టీ ఎంఐఎంకు జంట కవల పార్టీ గా ప్రవరిస్తుంది.ఇది తెలంగాణ లోని మెజార్టీ ప్రజలను అలాగే రామున్ని అవమానించడమే. రామాలయానికి ఇచ్చే నిధుల విషయంలో ఎం ఎల్ ఏ ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.
కేటీఆర్ మంత్రిలాగా కూడా ప్రవర్తించకుండా తన ఎమ్మెల్యేలను కట్టడి చేయకుండా ఎదురు బీజేపీని బెదిరిస్తూ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రకటనలు సరైనవి కావు. మెజార్టీ ప్రజల మనోభావాలను దెబ్బ తీయడమే అవుతుంది. కేటీఆర్ చేసే ఈ తాటాకు చపుళ్లకు బీజేపీ భయపడదని అలాగే అతను నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలని బీజేపీ హెచ్చరిస్తుంది. భారతదేశంలోని అన్ని మతాలకు సంబంధించిన ప్రజల దగ్గర నుంచి రామమందిరం కోసం ఈ చిన్న చిన్న మొత్తాలను విరాళంగా సేకరిస్తున్న స్ఫూర్తిని కేటీఆర్ వారి ఎమ్మెల్యేలు అర్థం చేసుకోవాలి.ప్రతీ భారతీయుడు ఆ మహోన్నతమైన రామమందిర నిర్మాణంలో తాను భాగస్వామినైనట్లుగా భావించాలని అందుకోసమే చిన్న మొత్తాలయినప్పటికీ ప్రతీ భారాతీయుడి దగ్గర విరాళాలు సేకరించాలని ట్రస్ట్ భావిస్తుంది.
వాస్తవానికి విశాల హృదయం కల దాతల వద్ద నుండి రామమందిర ట్రస్ట్ కి విరాళాలు వచ్చినప్పటికీ సామాన్యులందరినీ అందులో భాగస్వామ్యుల్ని చేయాలి కాబట్టే చందాలు వసూలు చేస్తున్నారు కానీ డబ్బులు లేక కాదు. కావాలంటే రాజ్యాంగం కల్పించిన మత స్వతంత్ర హక్కు గురించి ఆ హక్కు హిందువులకీ ఉందనే విషయం గురించి అలాగే పరమత సహనం గురించి టీఆరెస్ పార్టీకి,కేటీఆర్ కి వాళ్ళ ఎమ్మెల్యేలకి పాఠాలు చెప్పడానికి బీజేపీ సిద్ధంగా ఉంది.