తెలంగాణ మంత్రి కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు ఉగాది పంచాంగం చెప్పారు. అందేంటి అని షాక్ అవుతున్నారా?.. అవును ఇది నిజమే.. వీరు చెప్పిన పంచాంగాలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా జోరుగా వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య బీఆర్ఎస్, బీఆర్ఎస్ నేతల ట్వీట్లు హీటెక్కుతున్నాయి.
లేటెస్ట్ గా బుధవారం ఉగాది సందర్భంగా పంచాంగానికి ముడిపెట్టి చేసిన ట్వీట్లు ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ గా మారాయి. ఒకరిని మించి మరొకరు తమ తమ ట్వీట్లకు పదును పెట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మధ్య ట్వీట్స్ వార్ పీక్స్ కు చేరింది. వీరి ట్వీట్ వార్ జనాలకు ఇంట్రెస్టింగ్ గా మారింది.
మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘ఆదాయం: అదానీకి.. వ్యయం: జనానికి, బ్యాంకులకు. అవమానం: నెహ్రూకి.. రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి!!. బస్, బభ్రాజీమానం భజగోవిందం. దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
As forwarded 👇😁
ఆదాయం: అదానీకి!
వ్యయం: జనానికి, బ్యాంకులకు!అవమానం: నెహ్రూకి!
రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి!!బస్, బభ్రాజీమానం భజగోవిందం!
దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!— KTR (@KTRBRS) March 22, 2023
కేటీఆర్ ట్వీట్ చేసిన కాసేపటికే.. బండి సంజయ్ కూడా తనదైన స్టైల్ లో ట్వీట్ చేస్తూ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ‘ఆదాయం: కల్వకుంట్ల కుటుంబానికి.. వ్యయం: తెలంగాణ రాష్ట్రానికి. అవమానం: ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు. రాజపూజ్యం: ఉద్యమ ద్రోహులకు, దొంగలకు!! తుస్.. పిట్టల దొర, తుపాకి చంద్రుల గడీల పంచాయితీ లెక్క తేలుడే తరువాయి.. పతనం ఇగ షురువాయే’ అని బండి సంజయ్ ట్వీట్ చేశారు.
As forwarded 👇
ఆదాయం : కల్వకుంట్ల కుటుంబానికి
వ్యయం : తెలంగాణ రాష్ట్రానికిఅవమానం : ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు
రాజపూజ్యం : ఉద్యమ ద్రోహులకు, దొంగలకు !!తుస్.., పిట్టల దొర, తుపాకి చంద్రుల గడీల పంచాతీ లెక్క తేలుడే తరువాయి…పతనం ఇగ షురువాయే.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 22, 2023