ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ బీజేవైఎం నాయకులు ఛలో డీజీపీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే డీజీపీ ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేవైఎం నాయకులను పోలీసులు అడ్డుకన్నారు. ఈ క్రమంలో పోలీసులకు, నాయకులకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ తోపులాటలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ స్పృహ తప్పి పడిపోయారు.
అయినా పోలీసులు విచాక్షణారహితంగా భాను ప్రకాష్ పై లాఠీ ఛార్జ్ చేసి, ఈడ్చుకెళ్లి వ్యాన్ లో పడేశారు. ఈ సంఘటనలో భాను ప్రకాష్ కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే భాను ప్రకాష్ ని బీజేవైఎం నాయకులు గ్లోబెల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లి చికిత్స అందించారు.
ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బీజేవైఎం నాయకులకు ఫోన్ చేసి భాను ప్రకాష్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.
ఎస్ఐ, కాని స్టేబుల్ పరీక్షలో లక్షలాది మంది అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ఆందోళన చేస్తే.. అమానుషంగా వ్యవహరిస్తారా? అంటూ మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ కి పోయే కాలం వచ్చిందని, నిరుద్యోగుల ఉసురు తగలక తప్పదంటూ తీవ్రంగా విమర్శించారు.