కేసీఆర్ ఖబడ్దార్.. నీతి, నిజాయితీతో పని చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం.. నీ వీపంతా సాఫ్ చేస్తారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా ఆరవ రోజు బండి సంజయ్ సిర్గాపూర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ఏక్ నిరంజన్ పార్టీ అన్నారు. ఈ దెబ్బతో కేసీఆర్ ఔట్ అంటూ దుయ్యబట్టారు. శ్రీకాంతా చారి ఆత్మబలిదానంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఏ ముఖ్యమంత్రి కైనా షెడ్యూల్ ఉంటుందన్నారు. కేసీఆర్ కు మాత్రం షెడ్యూల్ ఉండదంటూ ఆయన విమర్శించారు. కేసీఆర్ ను ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ కు.. ప్రగతి భవన్ నుంచి బయటికి తెచ్చిన ఘనత బీజేపీదే అన్నారు.
సీఎం కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని దివాళా తీయించి చిప్ప చేతికిచ్చిందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో రూ.5 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలకు ఏం ఒరగపెట్టారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం సంపాదించిన వేల కోట్ల రూపాయలను లిక్కర్, డ్రగ్స్, క్యాసినో, రియల్ ఎస్టేట్ దందాల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. విదేశాల్లోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారని తెలిపారు. అందులో భాగంగానే లిక్కర్ స్కామ్ లో నీ బిడ్డకు నోటీసులిచ్చారు. అని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబం దోచుకున్న అవినీతి సొమ్మంతా కక్కిస్తామని స్పష్టం చేశారు.
దుబ్బాక, హుజురాబాద్ లో కేసీఆర్ కు బీజేపీ దెబ్బ రుచి చూపించామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 4 నుంచి 45 స్థానాలకు వెళ్లి, మనం ఏంటో కేసీఆర్ కి చూపించామన్నారు. మునుగోడులో కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేశాడో ప్రజలంతా చూశారని బండి పేర్కొన్నారు. మునుగోడులో ఒక్క బీజేపీ పోలింగ్ బూత్ సభ్యుడిని ఎదుర్కొనేందుకు.. ఒక్కో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చి కూర్చున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ అంటేనే టీఆర్ఎస్ నేతలు గజగజ వణుకుతున్నారన్నారు. దమ్ము, ధైర్యం ఉన్న కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలన్నారు. తెలంగాణ కేసీఆర్, కేసీఆర్ కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే బాగుపడుతున్నాయన్నారు. దొంగ దందా.. లంగ దందా చేసే వాళ్లని ఉపేక్షించే పరిస్థితే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి.
కేసీఆర్ బిడ్డ లిక్కర్ దందా చేస్తే నోటీసులు ఇవ్వరా? కేసీఆర్ కుటుంబాన్ని కాపాడటానికి.. ఇప్పుడు తెలంగాణ తరహా ఉద్యమం చేయాలా? అంటూ నిలదీశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు, మద్దతు ఇచ్చింది సుష్మా స్వరాజ్. తెలంగాణ బిల్లుకు సుష్మా స్వరాజ్ మద్దతు ఇవ్వకుండా ఈ రోజు కేసీఆర్ సీఎం అయ్యేవాడా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం, కమ్యునిస్టు పార్టీలు. వాటిని టీఆర్ఎస్ సంకలో పెట్టుకుందన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు.. కేసీఆర్ మందు తాగి ఇంట్లో పన్నడు. తెలంగాణ రావద్దని కోరుకున్నదే కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నటనలో జీవిస్తాడన్నారు. ఢిల్లీలో కేసీఆర్ దొంగ దీక్ష చేశాడు. బాత్రూంలో కూడా మందు తాగిన చరిత్ర కేసీఆర్ ది అంటూ ఘాటు ఆరోపణలు చేశారు. కార్ కి లోన్ కట్టే స్తోమత లేని కేసీఆర్.. ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? అంటూ నిలదీశారు బండి సంజయ్.