తెలంగాణ సర్కార్ పై మరోసారి తీవ్రంగా మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల జీవితాలతో జీవితాలతో చెలగాటమాడుతన్న వారిని వదిలేసి.. న్యాయం కోసం పోరాడుతున్న బీజేవైఎం కార్యక్రతలను అరెస్ట్ చేయడం ఏంటని బండి ప్రశ్నించారు.
ప్రశ్నాపత్రాల లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయన్నారు. తక్షణమే అరెస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తలను విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అరెస్టులు, జైళ్లు బీజేపీ కార్యకర్తలకు కొత్తకాదన్నారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అని ఫైర్ అయ్యారు. ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై దర్యాప్తును ప్రభుత్వం సిట్ అప్పగించడాన్ని ఆయన తప్పుబట్టారు.
సిట్ కు అప్పగించిన కేసులన్నీ నీరుగారిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు బండి సంజయ్.