బీజేపీ నేత జిట్టా బాలక్రిష్ణారెడ్డి అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన అరెస్ట్ ను ఖండిస్తూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
కాగా.. ఇదే విషయమై బీజేపీ నేత, మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. జిట్టా అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాలను బయటపెడితే నిర్బంధాలా..? అని ప్రశ్నించారు.
జిట్టా ఏమైనా హంతకుడా..? తీవ్రవాదా..? అర్ధరాత్రి అరెస్ట్ చేయమేంటి..? ప్రశ్నించారు చంద్రశేఖర్. ఉగ్రవాదులను, నేరాలు చేస్తున్న వాళ్లను అరెస్ట్ లు చేయడానికి చేతకాదు కానీ.. ప్రజల కోసం పోరాటాలు చేసే వాళ్లను మాత్రం బంధిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు సభలు, సమావేశాలు నిర్వహించే హక్కు కూడా లేదా..? అని నిలదీశారు. ప్రజాస్వామ్యబద్దంగా ప్రభుత్వ విధానాలు, కేసీఆర్ పనితీరును ప్రశ్నించడమే జిట్టా చేసిన నేరమా..? అని విరుచుకుపడ్డారు చంద్రశేఖర్.