కేసీఆర్.. కర్మకాలి తెలంగాణ కి సీఎం అయ్యాడని, పాస్ పోర్ట్ బ్రోకర్ నుండి ఇంతకన్నా ఎక్కువ ఏం ఆశిస్తామని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ను.. దుబాయ్ శేఖర్ అని పిలవాలి.. కేసీఆర్ చెట్టుకు కట్టేసి కొట్టిన విషయన్ని మర్చిపోయావా అని ఫైర్ అయ్యారు. లోపల ఉన్న దుబాయ్ శేఖర్, పాస్ పోర్ట్ బ్రోకర్ బుద్ది మారలేదు…కేసీఆర్ నీకు పోయేకాలం దాపురించిందంటూ విరుచుకుపడ్డారు.
ఇటీవల పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బిజెపి సభకు వచ్చిన రెస్పాన్స్ చూసి కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే బిజెపి జాతీయ నేతలపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీపై కూడా కేసీఆర్ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడారన్న ఆమె.. సీఎం కేసీఆర్ భాష తీరుతో తెలంగాణ సమాజం సిగ్గుపడుతోందని విమర్శించారు.
అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ లో హిందూ దేవతలపై మాట్లాడిన భాషపై విమర్శలు గుప్పించారు డీకే అరుణ. జోగులాంబ అమ్మవారిని అవమానించిండన్న ఆమె… జోగులాంబ అమ్మవారు కేసీఆర్ కు తగిన శాస్తి చెబుతుందని జవాబిచ్చారు.
అంతేకాకుండా డాక్టర్ కె. లక్ష్మణ్ ను విమర్శించే ముందు.. ఎంత మంది కాళ్లు మెక్కి కవిత ఎమ్మెల్సీ అయిందో కేసీఆర్ చెప్పాలంటూ ధీటైన జవాబిచ్చారు డీకే అరుణ. కేసీఆర్ లో మదాహంకారంతో పాటు దురాహంకారాన్ని ప్రజలు బొందపెట్టడం ఖాయమంటూ ఆమె హెచ్చరించారు.