డీకే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు
నడిగడ్డ పోరాటాల అడ్డా.. పోరుగడ్డ. నీళ్ల కోసం కత్తులు, రాళ్ల దాడికి భయపడకుండా రాయలసీమను ఎదిరించింది నడిగడ్డ. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో నడిగడ్డకు రాజోలిబండ డైవర్షన్ స్కీం ద్వారా ఒక్క చుక్క నీరైనా ఇచ్చారా? నడిగడ్డ ప్రజలు ఒకరికొకరు కొట్లాడుకునేలా కేసీఆర్ చిచ్చు పెడుతున్నరు. ఎట్టి పరిస్థితుల్లో ఒఫ్పుకోం. రూ.6 వేల కోట్లు ఖర్చు పెట్టైనా సరే ఆర్డీఎస్ కింద ప్రతి ఎకరాకు నీరివ్వాల్సిందే.
పాలమూరు ప్రజలు ఏ పాపం చేశారు? నడిగడ్డ ప్రజలు కనపడతలేరా? ఏ ప్రాజెక్టైనా పూర్తి చేశావా? ఒక్క కాలువ తీయలేదు. తట్టెడు మట్టి తీయని దుర్మార్గుడు కేసీఆర్. గత పాలకులు చేసిన పనులను తమవిగా చెప్పుకోవడానికి టీఆర్ఎస్ నేతలకు సిగ్గులేదా?
కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల ద్వారా ఇప్పటి వరకు కొత్త ఆయకట్టుకు ఇచ్చిందేమీ లేదు. ఒక్క ఎకరాకు నీళ్లు పారించకుండానే దుష్ర్పచారం చేసుకుంటున్న ఘనులు టీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ ను ఓడించి తీరుతామని జోగులాంబ సాక్షిగా ప్రమాణం చేయాల్సిందే. మన బతుకులు మారాలంటే.. కేసీఆర్ గద్దె దిగాల్సిందే.
స్కూళ్లలో వసతుల్లేవు. ఆసుపత్రుల్లో సౌకర్యాల్లేవు. మాటలతో కడుపు నింపాలని చూస్తున్నాడు కేసీఆర్. ఒక్క ఉద్యోగమివ్వని కేసీఆర్ ను ఓడించాలా? లేదా? కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబం మాత్రమే బంగారు కుటుంబం అయ్యింది.