తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు బీజేపీకి సెమీఫైనల్స్ అన్నారు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. స్థానిక ఎన్నికలల్లో అధికార తెరాస పై పట్టుసాధించటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు లక్ష్మణ్. హుజూర్ నగర్ ఎన్నికల్లో తెరాస విజయం సాధించినంత మాత్రాన గొప్పేం కాదు అని, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు హయాంలో నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. కానీ తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో గోరపరాజయం మూటగట్టుకుందన్నారు లక్ష్మణ్.
అధికార తెరాస కు బీజేపీ పోటీయా కదా అనేది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయన్నారు. కూతురు ఓడిపోయినప్పుడు ప్రెస్ మీట్ పెట్టని కేసీఆర్, ఉప ఎన్నికల్లో గెలవగానే పెట్టారంటూ ఎద్దేవా చేశారు. హైకోర్టు చివాట్లు పెడుతున్న స్పందించని కేసీఆర్ ఆఖరికి ఒక్కరే మిగిలిపోతారన్నారు.