తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కేంద్ర నాయకత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు బీజేపీ నేత లక్ష్మణ్. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ కు ప్రజల్లో ఆదరణ లేదన్నారు. గుజరాత్ గురించి మాట్లాడే ముందు బీఆర్ఎస్ నేతలు ఆలోచించుకోవాలని సూచించారు. బీజేపీని విమర్శించే అర్హత బీఆర్ఎస్ కు లేదని దుయ్యపట్టారు. బీజేపీ కార్యకర్తల పార్టీ అని తెలిపారు.
జేపీ నడ్డా నాయకత్వంలో బీజేపీ మరింత బలపడిందన్నారు. 9 రాష్ట్రాల ఎన్నికలను కమలం సవాల్ గా స్వీకరించిందన్నారు. బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మిషన్ 405తో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీని ఓడించాలని చూస్తున్నారు తప్ప.. ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడం లేదన్నారు.
తెలంగాణతో పాటు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. మంత్రి కేటీఆర్ చదువుకున్న అజ్ఞాని అని.. బావిలో కప్ప మాదిరిగా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఈ నెల 29, 30న హరియాణాలోని గుర్గావ్ లో జాతీయ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ నెల 24న పాలమూరులో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయన్నారు. బండి సంజయ్ పాదయాత్రను మోడీ కొనియాడారంటే.. రాష్ట్ర అధ్యక్ష పదవి కొనసాగింపు ఉంటుందా? లేదా? అన్నది మీరే అర్థం చేసుకోవాలన్నారు.