మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందం గురించి పెద్దగా చెప్పేదేమీ ఉంది. ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా అదే అందాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన గుబురు గెడ్డం పెంచిన కొంతమంది అభిమానులు ఈ లుక్ లో పవన్ కళ్యాణ్ సూపర్ గా ఉన్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ అందం గురించి సినీ నటి, బీజేపీ మహిళ నాయకురాలు మాధవీ లత కామెంట్ చేశారు. ఈ ఏజ్ లో కూడా ఎంత అందంగా ఉన్నాడో.. ఏమైనా సరే అబ్బా పవన్ కళ్యాణ్ అందగాడు అంటూ పవన్ ఫోటోతో పోస్టు చేసింది మాధవి లత. ఈ పోస్ట్ చేయగానే పవన్ ఫ్యాన్స్ మాధవి లతను కూడా ప్రశంసలతో ముంచెత్తారు.
అయితే పవన్ పై మాధవి లతకు అంత ప్రేమ పుట్టుకురావడానికి కారణం ఏంటని చర్చించుకుంటున్నారు. పవన్ జనసేనతో చేతులు కలపడం మూలంగానే అతనిపై బీజేపీ మహిళ నాయకురాలైన మాధవి లతకు ప్రేమ పుట్టుకొచ్చిందని అంటున్నారు.