తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా తనపై అధికార పార్టీలకు చెందిన వారు టార్గెట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో తన పట్ల అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు నటి మాధవి లత. ఇదే విషయమై సీపీ సజ్జనార్ ను ఆమె కలిశారు.ఏపీలో దేవాలయాలపై దాడులు జరుగుతూ ఉండటం పట్ల తాను పోరాడుతున్నానని అప్పటినుంచి తనను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం ఎక్కువైందని ఆమె వివరించారు. నా వృత్తికి, నా మతానికి నా వ్యక్తిత్వానికి సంబంధం ఏంటని మాధవీలత ప్రశ్నించారు.
ఎక్కడ అమ్మాయిలు పట్టుబడినా అది నేనే అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన చెందింది. తనపై వ్యభిచారి అనే ముద్ర వేసేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.