కేంద్ర ప్రభుత్వ 20లక్షల కోట్ల ప్యాకెజీ దగా , అంకెల గారడీ , పచ్చి మోసమన్న కెసిఆర్ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు . కెసిఆర్ నాలుకకు నరం లేదని, మొన్నటికి మొన్న మోదీ నిర్ణయాలు అద్భుతమన్న కెసిఆర్ ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారో చెప్పాలన్నారు.ఇంటర్నేషనల్ జర్నల్స్ లో ప్యాకెజీ ని తప్పుబట్టారన్న కెసిఆర్ వ్యాఖ్యలపై కూడా సీరియస్ అయ్యారు . వెబ్ పోర్టల్స్ లో వ్యక్తిగత అభిప్రాయాలను పట్టుకొని ప్రపంచం మొత్తం మోదీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారని ప్రచారం చేయడం దారుణమన్నారు. న్యూయార్క్ టైమ్స్ ఇంకా మరికొన్ని జర్నల్స్ మోదీ ని పొగిడిన వాస్తవాన్ని కెసిఆర్ తెలుసుకోవాలన్నారు .
కేంద్రం నుండి ఇచ్చిన డబ్బులను వేరే వాటికి ఖర్చు పెట్టి వలస కూలీలను పట్టించుకోలేదన్నారు .కెసిఆర్ కు దమ్ముంటే ఈ 6సంవత్సరాల్లో కేంద్రం ఇచ్చిన నిధులపై ఎక్కడ ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు . పోతిరెడ్డి పాడు అంశం కెసిఆర్ , జగన్ రాజకీయ లబ్ది కోసం ఆడుతున్న నాటకాలని మండిపడ్డారు . రఘునందన్ రావు పూర్తి ఇంటర్వ్యూ కింది వీడియోలో చూద్దాం