– ఓ వైపు నమాజ్ లు
– ఇంకోవైపు పూజలా?
– భాగ్యలక్ష్మీ ఆలయంపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
– భాగ్యలక్ష్మీ ఆలయంపై రాజకీయాలు చేస్తోంది
– ఓ వైపు ఆలయాన్ని కూల్చేస్తామంటున్నారు
– మరోవైపు పూజలు చేస్తున్నారు
– మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు
– రాజాసింగ్ ఘాటు విమర్శలు
పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తుండటం సిగ్గు చేటని విరుచుకుపడ్డారు బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్. ఒకవైపు భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద నమాజ్ చేస్తామంటున్నారని ఆరోపించారు. అమ్మవారి ఆలయాన్ని కూల్చేస్తామంటూ రెచ్చగొడుతూనే.. ఆలయం వద్దకు వెళ్లి పూజలు చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ నేతల ద్వంద్వ వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? మండిపడ్డారు.
భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం విషయంలో ఏనాడూ మేం రాజకీయాలు చేయలేదని తెలిపారు రాజాసింగ్. అమ్మవారి విశిష్టత, గొప్పతనాన్ని బీజేపీ చాటి చెప్తుంటే.. అందుకు భిన్నంగా ఆలయాన్ని కూల్చేస్తామనడం సిగ్గుచేటన్నారు. అక్కడే నమాజ్ చేస్తామంటూ రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ నేతలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
అమ్మవారి శక్తిని, విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్తున్న బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పై మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయాన్ని కూలుస్తానంటే చేతులు ముడుచుకు కూర్చుంటామనుకుంటున్నారా..? ఘాటుగా వ్యాఖ్యానించారు.
అమ్మవారి ఆలయాన్ని కూలుస్తామన్న నేతలపై కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడంతో పాటు.. సిగ్గులేకుండా బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతల తీరును చూసి జనం నవ్వుకుంటున్నారని విమర్శలు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ద్వంద్వ విధానాలను పక్కన పెట్టాలని హెచ్చరించారు.