ఏనుగుల రాకేష్ రెడ్డి..బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
కనిపించే నాలుగు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలు అయితే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్.. అని సాయి కుమార్ సినిమాలో డైలాగ్ చెప్తాడు. కానీ.. ఆ నాలుగో సింహాన్ని మా బీజేపీ సింహం రఘునందన్ రావు నిద్ర లేపేదాక మత్తులోనే ఉంది. నిద్రపోయేటోన్ని లేపడం సాధ్యం కానీ.. నిద్ర పోతున్నట్టు నటించే వాన్ని లేపడం అసంభవం.
మే 28 న ఘటన జరిగితే.. జూన్ ఒక్కటి వరకు పోలీసులు ఏం చేసినట్టు. దొంగలను వదిలిపెట్టి.. దొంగను పట్టించిన రఘునందన్ రావు మీద కేసు పెట్టడం మీ దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతుంది. గతంలో మహిళపై అత్యాచారం జరిగినప్పుడు వెంటనే ఎన్కౌంటర్ చేశారు. మరిప్పుడు అలా చేసే దమ్ముందా..? ఈ కేసులో పెద్దోళ్ల పిల్లలు ఎంఐఎం కార్పొరేటర్, ఎమ్మెల్యే, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ల పిల్లలు ఉన్నారు కాబట్టే ఇంత తాత్సారం చేస్తున్నారు.
మీరు ఎంఐఎం మెప్పుకోసం, ఒక వర్గాన్ని తప్పించడం కోసం వారం రోజుల నుండి నాటకాలు ఆడుతుంటే అందులో ఒకడు దుబాయ్ పారిపోయాడు. నిందితులు ఎక్కడికి పారిపోయిన తక్షణమే పట్టుకొచ్చి బొక్కలో వెయ్యాలి. రఘునందన్ రావు మీద మీరు కేసుపెట్టి తాత్కాలికంగా సంబరపడిపోవచ్చు. కానీ.. ఆయన వకీల్ సాబ్.. నల్లకోటు వేసుకొని కోర్టులో అడుగుపెడితే మీ చీకటి సామ్రాజ్యం కూలిపోవడం ఖాయం. రాష్ట్రం లో షీ టీమ్స్ ఎక్కడ పోయాయి.
ఆడపిల్లకు న్యాయం చెయ్యలేని చాతకాని హోమ్ మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేసి, సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలి. మా వరంగల్ కు చెందిన ఒక దళిత నాయకుడిని అకారణంగా రాత్రికి రాత్రే ఉప ముఖ్యమంత్రి పదవి నుండి బర్తరఫ్ చేశారు. ఎంఐఎం వాళ్లంటే అంత భయం ఎందుకు. ఓరుగల్లు ప్రజలు, నాయకులు మీ కంటికి అంత చులకనగా కనిపిస్తున్నారా..? తక్షణమే ఈ కేసును సీబీఐకి పంపి దర్యాప్తు చేయించి నిందితులను కఠినంగా శిక్షించాలి.