పవన్ చేస్తున్న లాంగ్ మార్చ్ లో కన్నా లక్ష్మినారాయణ పాల్గొనాల్సిన అవసరం లేదన్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. ట్విట్టర్ వేదికగా విష్ణువర్ధన్ రెడ్డి పవన్ పై పరోక్షంగా నిప్పులు చెరిగారు. మొదటి నుంచి ఇసుకపై పోరాటం చేసింది బీజేపీ పార్టీనే అని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ కి లేఖ రాసింది బీజేపీ, గవర్నర్ కి రిప్రజెంటేషన్ ఇచ్చింది బీజేపీ అని రాసుకొచ్చారు.ఇక దీనిపై కన్నా ఎలా స్పందిస్తారో చూడాలి.