ఎంతో మంది సీఎంలను అందించిన రాయలసీమ వెనుకబడటం ప్రజల దురదృష్టం అని, ప్రతిపక్ష చంద్రబాబు… సీఎం జగన్‌కు రాయలసీమ ప్రజల పట్ల విశ్వాసం లేదని విమర్శించారు బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి. రాయలసీమ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరూ రాయలసీమ అభివృద్ధి కొరకై రాజీనామా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రెండో రాజధానిని రాయలసీమ ప్రాంతంలో పెట్టడానికి అభ్యంతరం ఏమిటి అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నింటిలో పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్న సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. రాష్ట్రంలో పాలన పూర్తిగా రివర్స్ లో కొనసాగుతోందని… ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతులు ఆత్మహత్యలు పాల్పడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని, రాయలసీమలో ఎన్ని రోజులు గా ఉద్యమం జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు.