గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోంటూ బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీస్ కమిషనర్ కార్యాలయాల ముందు బీజేపీ ముఖ్య నేతలు తమ నిరసనను తెలియజేయగా.. మాన్సూరాబాద్ డివిజన్‌లో మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్న ఇంటిని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు
మన్సురాబాద్ డివిజన్ నుంచి స్థానికులు కాని టీఆర్ఎస్ నేతలు వెళ్లిపోవాలంటూ బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సూర్యాపేట నుంచి వచ్చిన వాళ్ల వెంటనే వెళ్లిపోయి, ప్రజాస్వామ్యాన్ని కాపాడలంటూ బీజేపీ అభ్యర్థి కొప్పుల నరసింహరెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు అక్కడే ఉన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇతర టీర్ఎస్ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.