అయోధ్య రామమందిరం విరాళాల సేకరణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై బీజేపీ నేతలు, కార్యకర్తలు దాడి చేశారు. హన్మకొండ నక్కలగుట్టలోని ఆయన ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లు రువ్వారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ దాడిలో ఎమ్మెల్యే ఇంట్లోని అద్దాలు, కుర్చీలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీ శ్రేణుల దాడి విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులను అరెస్టు చేసి, సుబేదారి పోలిస్ స్టేషన్ కు తరలించారు. దాడిలో వరంగల్ అర్బన్, రూరల్ రెండు జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఉన్నారు.