కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ -bjp leaders demands cbi enquiry in kaleswaram project - Tolivelugu

కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ

కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు బీజేపీ నేతలు. కాళేశ్వరం హాంగు-ఆర్భాటాలకు తప్పా ఒక్క చుక్క కూడా నీటిని తీసుకోలేదని స్పష్టం చేశారు. ఎల్లంపల్లి నీరే దిగువకు వచ్చింది తప్పా… కాళేశ్వరం పేరుకే ఉండిపోయిందన్నారు. ఈ అవినీతిపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని, సీబీఐతో విచారణ చేయించాలని కోరతామన్నారు బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్.

అధికార పార్టీ అండదండలున్న వారికి సబ్‌ కాంట్రాక్టులు ఇస్తూ పోతున్నారని, సీఎంకు రాత్రి ఏది గుర్తొస్తే… ఉదయం రిటైర్డ్‌ ఇంజనీర్లను పిలుచుకొని అమలు పరుస్తారని మండిపడ్డారు. ప్రాజెక్టులపై నిజనిర్దారణ కమిటీ వేయమని కూడా కోరుతామన్నారు. 30వేల కోట్ల ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్ట్‌ను రీడిజైన్‌ పేరుతో లక్ష కోట్లకు చేర్చి, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు వివేక్.

Share on facebook
Share on twitter
Share on whatsapp