ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన స్పెషల్ ప్యాకేజీ ని పాచిపోయిన లడ్డులతో పోల్చిన పవన్ కళ్యాణ్ ఎన్నికల తరువాత , తాజాగా బీజేపీ కి దగ్గరయ్యారు.వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారు. బీజేపీతో కలిసి బలమైన శక్తిగా ముందుకు వెళ్తామంటూ ఆ పార్టీతో జత కట్టారు.పవన్ అదే అభిప్రాయంతో ఉన్నా , బీజేపీ వైఖరిలో మాత్రం మార్పు స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎలాగైనా తెలుగు దేశం పార్టీ స్థానాన్ని ఆక్రమించాలని కలలు గన్న బీజేపీ, వైసీపీ తో స్నేహం చేస్తున్నట్టే కనిపిస్తోంది. వైసీపీ నీ సేఫ్ పార్టనర్ గా బీజేపీ చూస్తోందని పలువురి అభిప్రాయం. వచ్చే ఎన్నికల్లో ఎలాగో బీజేపీ గెలిచే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ ప్రభావం పెద్దగా ఉండదు అనే అంచనాకు వచ్చిన బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. మొన్నటి మోడీ ,అమిత్ షా తో జగన్ భేటీ కూడా సానుకూల వాతావరణంలోనే జరిగింది. మూడు రాజధానుల నిర్ణయానికి రాష్ట్ర బీజేపీ నాయకులు వ్యతిరేకించినా, బీజేపీ అధిష్టానం ఆశీస్సులతో నే జగన్ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జగన్ కూడా పవన్ కళ్యాణ్ ను బీజేపీ కి దగ్గర కాకుండా, బీజేపీ చెప్పింది చేస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండదని జగన్ భావిస్తున్నారట. అందులో భాగంగానే పార్లమెంట్ లో ప్రతీ బిల్లుకు వైసీపీ మద్దతు ఇస్తోంది.సో వైసీపీ లాంటి సేఫ్ పార్టనర్ ని వదులుకోవడం ఎందుకని బీజేపీ భావిస్తున్నట్టు కనిపిస్తోంది.మరీ ప్రజల్లో వ్యతిరేకత పెరిగినప్పుడు చూసుకుందాం అనే ఆలోచనతో బీజేపీ ఉన్నట్టు కనిపిస్తోంది.