రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ధర్నా చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు.
ప్రభుత్వ పథకాల ఫ్లెక్సీలు తొలగించకుండా, ఎన్నికల సంఘం పరోక్షంగా టీఆర్ఎస్ కు మద్ధతు పలుకుతుందని బీజేపీ ఆరోపిస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారనే టీచర్లకు ఎన్నికల విధులు అప్పగించలేదని నేతలు మండిపడ్డారు. ఎన్నికల కార్యాలయం లోపలికి దూసుకెళ్లేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించారు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మొహరించారు.
ఎన్నికల సంఘం, కమిషనర్, సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నాలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, నల్లు ఇంద్రసేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.