ఆమధ్య దళిత బంధుపై మాట్లాడుతూ.. టిఆర్ఎస్ సన్యాసుల పార్టీ కాదు.. రాజకీయ పార్టీ అని కేసీఆర్ అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలవడానికి ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలప్పుడు వేల కోట్ల రూపాయలను అభివృద్ధికి కేటాయించడంలో తప్పేముందని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా తయారయ్యాయి.
కేసీఆర్ వ్యాఖ్యల ఆధారంగా.. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తుంది.. నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందంటూ వినూత్న నిరసన చేపట్టారు మేడ్చల్, మల్కాజిగిరి ఎస్సీ, మహిళా మోర్చా నాయకులు. ఎమ్మెల్యే గాంధీ రిజైన్ చేయాలంటూ వెంకటేశ్వర నగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు.
ఉప ఎన్నిక వస్తే శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని దళితులకు కూడా రూ.10 లక్షలు వస్తాయని… వేల కోట్ల రూపాయల నిధులు మంజూరవుతాయని అన్నారు నాయకులు. అందుకే ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ఎస్సీ మోర్చా నాయకులు రమేష్, ఉపేందర్, యాకయ్య, డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షులు గణేష్ గౌడ్, దయాకర్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు తిమ్మయ్య, లక్ష్మణ్, బొట్టు శీను, బీజేవైఎం అధ్యక్షుడు సాయి కిరణ్, ప్రధాన కార్యదర్శి సంతోష్, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శులు మమతా, సంధ్య, ఉపాధ్యక్షులు శృతి గౌడ్, సెక్రటరీ భారతీ, గీత, ఉపేంద్ర, కార్యవర్గ సభ్యులు శాలిని, సత్య, బీజేపీ నాయకులు వెంకటేష్, తిరుపతి రెడ్డి, మహేందర్, శ్రవణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.