బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ పోస్ట్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది. ప్రధాని మోడీ ఓ దివ్యాంగురాలి కాళ్లు మొక్కుతున్న ఫోటో అది. ఇటీవల మోడీ వారణాసి పర్యటన సందర్భంగా ఇది చోటు చేసుకుంది.
శిఖా రాస్తోగి అనే దివ్యాంగురాలు మోడీని కలిసేందుకు వచ్చి ప్రధాని ఆశీర్వాదం కోసం ప్రయత్నించింది. దీంతో వెంటనే మోడీ ఆమె పాదాలకు మొక్కారు. దీనికి సంబంధించిన ఫోటోను వానతి శ్రీనివాసన్ పోస్ట్ చేశారు. ఇది మహిళా శక్తికి గౌరవం అని ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
यह सम्मान समस्त नारी शक्ति का सम्मान है । गर्व है हम सभी को अपने प्रधानमंत्री श्री @narendramodi जी पर । pic.twitter.com/L989Wp8Ukl
— Vanathi Srinivasan (@VanathiBJP) December 15, 2021
Advertisements