జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని బీజేపీ మజ్దూర్ సెల్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు గోపాల్ డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొలువులపై విడుదల చేసిన ప్రకటనలో కేవలం 11వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులనే రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించారని అన్నారు. అలా కాకుండా అన్ని విభాగాల్లో పని చేస్తున్న వేలాది మంది కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కేసీఆర్ జీహెచ్ఎంసీ కార్మికుల సమక్షంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దానిని విస్మరిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
వెంటనే కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని లేదంటే తగిన బుద్ధి చెబుతామన్నారు గోపాల్.