రఘునందన్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే
రాష్ట్రానికి మెతుకు పెట్టిన మెదక్ ను కేసీఆర్ కు కన్నుకుట్టి మూడు ముక్కలు చేశారు. కొత్త జిల్లాలు వస్తే ఉద్యోగాలొస్తాయని అనుకున్నాం. కానీ.. ఒక్కటీ రాలేదు. ఎన్నో కంపెనీలు ఇక్కడే ఉన్నాయి. భూములు మనవే. కొలువులు మాత్రం పరాయి వాళ్లకు ఇస్తున్నారు. హరీష్ రావు హుజూరాబాద్ లో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆయనకు చేతనైతే డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టి చూపించాలే తప్ప ఉత్తమాటలు వద్దు.
హైదరాబాద్ లో కూర్చుని ఒకాయన మాట్లాడతారే తప్ప ఇక్కడి సమస్యలను మాత్రం పట్టించుకోరు. ఫకీరోళ్లు, పిట్టల దొరలు ఎన్నో మాట్లాడుతున్నారు.. జిల్లాను అభివృద్ధి చేసిందేమీ లేదు. కనీసం ఇంటింటికీ నీళ్లు రావడం లేదు. కానీ.. బీర్ల కంపెనీలు మాత్రం ఉంటున్నాయి. ఏం ఇక్కడి ప్రజలకు నీళ్లు వద్దా.. బీర్లు తాగి బతకాలా..? తాగు.. తిను.. పడుకో అన్నట్లుగా కేసీఆర్ పాలన ఉంది. అందుకే బడులు బంద్ పెట్టి బార్లు తెరిచారు.