పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసన సభ బిల్లును ఆమోదించటంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళనకు దిగారు. చర్చ సందర్భంగా మాట్లాడుతూ… సీఏఏ వ్యతిరేక బిల్లు పేపర్లను సీఎం కేసీఆర్ ముందే చించేసి నిరసన తెలిపారు. సీఏఏ వల్ల ఎవరికీ నష్టం లేదని, ఓ ఒక్కరికి ఇబ్బంది కలిగిన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయటంతో పాటు తెలంగాణ విడిచి వెళ్లిపోతానంటూ రాజాసింగ్ సవాల్ విసిరారు.
సీఏఏతో రాజకీయం చేయలనుకుంటున్నారని, కేంద్రం ఈ చట్టం ద్వారా పౌరసత్వం ఇస్తుందే తప్పా… హిందూ-ముస్లింలను వేరు చేయదన్నారు. శాసన సభ బిల్లును ఆమోదిస్తున్న సందర్భంలో వెల్‌లోకి వచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్, స్పీకర్ పోడియం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు.