రాజీనామా చేస్తా.. తన నియోజకవర్గానికి ప్రత్యేక ప్యాకేజీ్ ఇవ్వమని ప్రభుత్వానికి సవాల్ విసిరిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. మరోసారి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ కోడలు సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్ చేసిన కేసీఆర్ కు పీవీ సింధు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. సింధుని బ్రాండ్ అంబాసిడర్ చేయాలని డిమాండ్ చేశారు.
టోక్యో ఒలింపిక్స్ లో సింధు కాంస్య పతకం గెలిచి భారత్ కు, తెలంగాణకు గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పారు రాజాసింగ్. అలాగే కేసీఆర్ క్రీడాశాఖపై దృష్టి పెట్టాలని అన్నారు. గ్రౌండ్స్, అకాడమీలను ఏర్పాటు చేయాలని కోరారు. క్రీడాశాఖను అభివృద్ధి చేస్తే రాష్ట్రంలో ఎంతోమంది మంచి ప్లేయర్స్ వెలుగులోకి వస్తారని చెప్పారు రాజాసింగ్.