'జార్జిరెడ్డి' సినిమాపై రాజాసింగ్ వార్నింగ్ - Tolivelugu

‘జార్జిరెడ్డి’ సినిమాపై రాజాసింగ్ వార్నింగ్

BJP MLA Raja singh Warns To George Reddy Movie, ‘జార్జిరెడ్డి’ సినిమాపై  రాజాసింగ్ వార్నింగ్

ఈ నెల 22న విడుదల కానున్న జార్జిరెడ్డి సినిమాపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందించారు. జార్జిరెడ్డి సినిమాపై తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే సినిమాలో తమ సంఘాలను కించపరిస్తే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు. సినిమా ముసుగులో తమ సంఘాలపై ఆరోపణలు చేయకూడదన్నారు. అలా చేస్తే అడ్డుకుంటామని చెప్పారు. సినిమాలో నిజాలను మాత్రమే చూపించాలని కోరారు. ఏబీవీపీ నాయకులపై దాడులకు సూత్రదారి జార్జిరెడ్డేనని ఆరోపించారు. జార్జిరెడ్డి హత్య జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని గుర్తు చేశారు.
ప్రగతిశీల భావాలు కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా నిర్మాత అప్పిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp