పోలీసులు అయ్యప్ప మాల ధరించి… డ్యూటీలకు రావొద్దు, కావాలంటే సెలవులపై వెళ్లండి అంటూ మెమో జారీ చేసిన రాచకొండ సీపీ మహేష్ భగవత్‌పై ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. చట్టం అందరికీ సమానమే అయినప్పుడు రంజాన్ మాసంలో ముస్లింలకు ఎందుకు రోజా ఉండొద్దు, టోపీలు పెట్టొద్దు, గడ్డం పెంచొద్దు అని ఎందుకు చెప్పలేదన్నారు.
తెలంగాణలో అంతా కలిసిమెలిసి ఉంటే పోలీసుల్లో మాత్రమే ఎందుకీ ఫీలింగ్ అని ప్రశ్నించారు రాజాసింగ్. ఫీడం ఇస్తే అందరికీ ఇవ్వాలని… మీకు ఈ ఆదేశాలు జారీ చేయమని సీఎం నుండి మెమో వచ్చిందా, ఎంఐఎం ఆఫీసు నుండి వచ్చిందా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందువలకు మాత్రమే ఇవ్వం అంటే ఎం జరుగుతుందో, బాధ్యులైతరు అని హెచ్చరించారు.